పథకం ఉద్దేశం మరియు ప్రణాళిక :
కరోనా ఆపత్కాల సమయంలో వలస కార్మికులు మరియు అసంఘటిత కార్మికుల ఇబ్బందులు మరియు కష్టాలను పరిగణలోకి తీసుకుని స్పెషల్ లీప్ పిటిషన్ 6/2020, తేది 29.06.2021 ద్వారా సుప్రీమ్ కోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో e-SHRAM PORTAL ప్రవేశపెట్టింది. తేది 26.08.2021 నుండి అసంఘటిత రంగ కార్మికుల రిజిస్ట్రేషన్ జరుగును.
ఎవరు అర్హులు :
- భవన మరియు నిర్మాణ కార్మికులు,
- వలస కార్మికులు,
- చిన్న మరియు సన్నకారు రైతులు,
- వ్యవసాయ కూలీలు,
- కౌలు రైతు,
- మత్స్యకారులు,
- పశుపోషణలో నిమగ్నమైన వారు,
- బీడీ రోలింగ్ లేబులింగ్ మరియు ప్యాకింగ్;
- భవన మరియు నిర్మాణ కార్మికులు;
- తోలు కార్మికులు,
- వడ్రంగి;
- ఉప్పు కార్మికులు,
- ఇటుక బట్టీలు మరియు రాతి క్వారీలలో కార్మికులు,
- సా మిల్లులలో కార్మికులు;
- మంత్రసానులు;
- క్షురకులు,
- కూరగాయలు మరియు పండ్ల విక్రేతలు;
- వార్తాపత్రిక విక్రేతలు,
- రిక్షా పుల్లర్లు;
- ఆటో డ్రైవర్లు;
- సెరికల్చర్ కార్మికులు;
- వడ్రంగులు;
- చర్మ శుద్ధి కార్మికులు;
- సాధారణ సేవా కేంద్రాలు;
- వీధి వర్తకులు;
- MNGRGA కార్మికులు;
- ఇళ్లలో పనిచేసే పనిమనుషులు,
- అగ్రికల్చరల్ వర్కర్స్,
- స్ట్రీట్ వెండోర్స్,
- ఆశ వర్కర్స్,
- అంగన్వాడీ వర్కర్స్,
- మత్స్య కార్మికులు,
- ప్లాంటేషన్ వర్కర్స్,
- ఇళ్లకు తిరిగి పాలు పోయు వారు ,
- హమాలీలు,
- లఘు వ్యాపారస్తులు మొదలైనవారు.
- ESI & EPF సభ్యత్వం లేనివారు అర్హులు
- 16-59 సంవత్సర మధ్య వయస్కులు ఈ పథకమునకు అర్హులు పుట్టిన తేదీ (26-08-1961 to 25-08-2005) మధ్య ఉన్నవారు అర్హులు
ఈ పథకంలో చేరు విధానం:
e-SHRAM PORTAL నందు రిజిస్ట్రేషన్ కొరకు ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు. eShram Official website i.e
https://register.eshram.gov.in/#/user/self
ఉచితంగా పేర్లు నమోదు జరుగును. నమోదు ప్రక్రియ సమీప CSC Centres & Post Office, గ్రామ , వార్డు సచివాలయములలో లలో జరుగును. కార్మిక శాఖ వారి కార్యాలయములలో లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి సహాయ సహకారం కార్మికులకు అందించబడును.
ఇది పూర్తిగా ఉచితం
కావలసిన డాక్యుమెంట్ లు :
- ఆధార్ కార్డు
- బ్యాంకు పాస్ బుక్
- ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్
- అప్లికేషన్ ఫారం
ఈ పథకముల వలన లాభాలు:
- అసంఘటిత కార్మికులు సామాజిక భద్రతా చట్టము క్రింద సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతారు
- అసంఘటిత కార్మికుల, వలస కార్మికుల కోసం పాలసీ & ప్రోగ్రామ్ లో డేటాబేస్ ప్రభుత్వానికి సహాయపడుతుంది
- అసంఘటిత కార్మికుల వృత్తి, నైపుణ్యాభివృద్ధి , మరిన్ని ఉపాధి అవకాశాలను అందించడానికి ఉపయోగపడుతుంది
- అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత కొరకు ఆర్ధిక సహాయం (Direct Bank Transfer) ద్వారా కార్మికుల/నామినీల ఎకౌంటు నకు నేరుగా జమ చేయబడుతుంది. అసంఘటిత మరియు వలస కార్మికులూ నమోదు చేసుకోండి లబ్ది పొందండి.
0 Comments
Thank you For Your Comment We Will Get In Touch You Soon