వైయస్సార్ పెన్షన్ కానుక కు సంబంధించి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ ఇవ్వడం జరిగినది. పెన్షన్ దారుడు చనిపోయిన తరువాత వారి మరణ ధ్రువీకరణ విషయంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా సచివాలయాల్లో WEA/WWDS వారి వరకే పరిమితంగా ఉండే మరణ ధ్రువీకరణ ఇప్పుడు కొత్తగా PS/WAS వారి ఆమోదం తప్పనిసరి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల సరాసరిగా 64 లక్షల పెన్షన్ల నగదును విడుదల చేస్తూ ఉంది అందులో 99% పైగా నగదు పెన్షన్ దారులు అందుకుంటున్నారు. నగదు పంచని పెన్షన్దారుల వివరాలను మొబైల్ అప్లికేషన్లో ప్రతి నెల నమోదు చేయవలసి ఉంటుంది. ప్రతి నెల పెన్షన్ పంచిన తర్వాత పెన్షన్ దారుడు మరణించడం వలన పెన్షన్ తీసుకోకపోతే వారి యొక్క వివరాలను గ్రామాల్లో WEA వారు, వార్డులో WWDS వారు మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శుల వారు అధికారికంగా మరణ ధ్రువీకరణ పత్రాలను ఇస్తున్నారు అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో మునిసిపల్ కమీషనర్ ఆఫీస్ వారు మరణ ధ్రువీకరణ పత్రాలను ఇస్తున్న విషయం అందరికీ తెలిసినదే. పెన్షనర్ యొక్క మరణ ధ్రువీకరణ సంబంధించి సరిగా జరిగేందుకు ధ్రువీకరణ విధానంలో కొన్ని మార్పులు చేయడం జరిగినది.
మరణ నిర్ధారణ క్రమము
- ముందుగా పెన్షన్ దారుడు మరణించిన వెంటనే వారికి DEATH CAPTURE చేయుటకు WEA / WWDS వారికి SS PENSION పోర్టల్ లో ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది. పోర్టల్ తో పాటు మొబైల్ అప్లికేషన్ లో Death Capture చేయిటకు WEA / WWDS వారికి ఆప్షన్ ఉంటుంది.
- SS PENSION పోర్టల్ మరియు మొబైల్ అప్లికేషన్ లోWEA / WWDS వారు Death Capture చేసిన అప్లికేషన్ లు సంబందించిన PS / WAS వారి SS PENSION పోర్టల్ లాగిన్ కు Forward అవుతుంది.
- PS / WAS వారు OTP ఆదరంగా Death Capture అప్లికేషన్ లను ఆమోదం తెలిపాల్సి ఉంటుంది.SS Pension పోర్టల్ లో Profile సెక్షన్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ కు మాత్రమే OTP వస్తుంది. ఆధార్ కు లింక్ అయినా మొబైల్ నెంబర్ కు కాదు.
- PS / WAS వారి లాగిన్ లో ప్రతీ నెల 19వ తారీఖు లోపు Death Capture ఆమోదం తెలిపిన పెన్షన్ లు మరుసటి నెల నుంచి పెన్షన్ నగదు ఆగిపోతుంది. 19వ తారీకు సాధారణ సెలవు/ఆదివారం అయినా సంబందం లేదు.
0 Comments
Thank you For Your Comment We Will Get In Touch You Soon