రైస్ కార్డు - ముఖ్యమయిన సమాచారం
1. రైస్ కార్డు అడ్రస్ , సచివాలయం అడ్రస్, పాత రేషన్ కార్డు నెంబర్, మొత్తం కార్డులోని వ్యక్తుల పేర్లు, వ్యక్తుల స్టేటస్, కార్డు స్టేటస్ తెలుసుకోటానికి :
1. మొబైల్ లేదా PC లేదా ట్యాబు లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి "epos" ఎంటర్ చేసి అని సెర్చ్ చెయ్యాలి. అలా చేసాక చాలా రిజల్ట్స్ వస్తాయి. అందులో https://epos.ap.gov.in ను ఓపెన్ చెయ్యాలి.
2. పైన చూపిస్తున్న లిస్ట్ లలో "MIS" పై క్లిక్ చెయ్యాలి. అందులో ఉన్న వాటిలో "RATION CARD / RICE CARD SEARCH" ను పై క్లిక్ చెయ్యాలి.
3. RC Number అని చూపిస్తున్న దగ్గర రేషన్ కార్డు లేదా రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చెయ్యాలి లేదా పక్కన పేజీ లో ఎక్కడ అయినా ఎంటర్ చెయ్యాలి.
4. వెంటనే కార్డు ఉన్నటు వంటి అడ్రస్, సచివాలయం అడ్రస్, పాత రేషన్ కార్డు నెంబర్, మొత్తం కార్డులోని వ్యక్తుల పేర్లు, వ్యక్తుల స్టేటస్, కార్డు స్టేటస్ చూపిస్తుంది.
5. Transaction History అనే ఆప్షన్ లో కార్డు ద్వారా తీసుకున్న రేషన్ వివరాలు , రేషన్ డిపో నెంబర్, ఎవరి బయోమెట్రిక్ ద్వారా తీసుకున్నారో ఆ వివరలు అన్ని ఉంటాయి.
2.రైస్ కార్డు నందు ఉండే యూనిట్ ల మధ్య సంబందాలు, వయసులు, ఆధార్ సీడింగ్ స్టేటస్, కార్డులో ఆక్టివ్ గా ఉన్నారా లేదా తెలుసుకోటానికి :
1. 1. మొబైల్ లేదా PC లేదా ట్యాబు లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి "aepos" ఎంటర్ చేసి అని సెర్చ్ చెయ్యాలి. అలా చేసాక చాలా రిజల్ట్స్ వస్తాయి. అందులో https://aepos.ap.gov.in ను ఓపెన్ చెయ్యాలి.
2. హోమ్ పేజీ లో Reports సెక్షన్లో RC Details అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.
3. RC నెంబర్ దగ్గర రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చెయ్యాలి. వెంటనే పైన తెలిపిన వివరాలు అన్ని చూపిస్తుంది.
పై సమాచారం అంతటికి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
3. T నెంబర్ తో రైస్ కార్డు సెర్చ్ చెయ్యు విధానం :
Step 1 : గూగుల్ లో Epdsap అని సెర్చ్ చెయ్యండి.
Step 2 : https://epds2.ap.gov.in అని చూపిస్తున్న లింక్ పై క్లిక్ చెయ్యండి
Step 3 : మొబైల్ లో అయితే మూడు లైన్ ల పై క్లిక్ చెయ్యాలి రెండవ "DASHBOARD" అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి. సిస్టం లో అయితే డైరెక్ట్ గా మెనూ బార్ లో "DASHBOARD" పై క్లిక్ చెయ్యాలి
Step 4 : Ration Card సెక్షన్ లో "EPDS APPLICATION SEARCH" పై క్లిక్ చెయ్యాలి.
Step 5 : Enter Application Id Daggara T తో స్టార్ట్ అయ్యే అప్లికేషన్ ID ను ఎంటర్ చెయ్యాలి. పక్కన చూపిస్తున్న CAPTCHA కోడ్ ను ఎంటర్ చేయాలి. SEARCH పై క్లిక్ చెయ్యాలి.
Step 6 : కింద చూపిస్తున్న విధం గా T నెంబర్ పక్కన రైస్ కార్డు నెంబర్ చూపిస్తుంది.
4. రైస్ కార్డు సరెండర్ అయ్యిందో లేదో తెలుసుకోటానికి :
Step 1 : గూగుల్ లో epos అని టైపు చేసి సెర్చ్ చెయ్యాలి
Step 2 : https://epos.ap.gov.in అని చూపిస్తున్న లాగిన్ పై క్లిక్ చెయ్యాలి. ఒకవేళ లాగిన్ పేజీ ఓపెన్ అయితే https://epos.ap.gov.in ను సెర్చ్ బార్ లో సెర్చ్ చెయ్యాలి.
Step 3 : MIS అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.
Step 4 : Ration Card / Rice Card Search దగ్గర రైస్ కార్డు లేదా రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చెయ్యాలి. సిస్టం లో అయితే Enter ను ప్రెస్ చెయ్యాలి. మొబైల్ లో అయితే పక్కన ఎక్కడ అయినా tap / క్లిక్ చెయ్యాలి.
Step 5 : కింద చూపించిన విధం గా RC స్టేటస్ వద్ద సరెండర్ అని చూపిస్తే కార్డు సరెండర్ చేసినట్టు అర్థం. అదే Active అని వస్తే కార్డు యాక్టీవ్ లో ఉన్నట్టు అర్థం, వారికి రేషన్ వస్తుంది.
0 Comments
Thank you For Your Comment We Will Get In Touch You Soon