కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మా్న్ నిధి స్కీ్మ్‌ను తీసుకువచ్చింది. ఈ పథకం కింద అన్నదాతలకు సంవత్సరానికి రూ.6,000 లభిస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి బ్యాంక్ ఖాతాలో పడదు. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది.
పీఎం కిసాన్ స్కీమ్ అంటే?
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ పేరుతో కొత్త పథకాన్నిలాంచ్ చేసింది. దేశంలోని రైతులు (ఏ రాష్ట్రానికి చెందిన వారైన పర్లేదు) ఈ స్కీమ్‌లో చేరొచ్చు. దీని కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు.
కిసాన్ స్కీమ్‌లో ఎలా చేరాలి?
రైతులు అందురూ పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరొచ్చు. దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లోనే సులభంగానే పథకంలో చేరొచ్చు. దీని కోసం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ ఫార్మర్స కార్నర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి స్కీమ్‌లో చేరొచ్చు.
ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి?
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌లో చేరాలంటే రైతులకు కచ్చితంగా పొలం పాస్ బుక్ ఉండాలి. అలాగే 5 ఎకరాలలోపు పొలం ఉండాలి. ఇంకా బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. ఇంకా ఆధార్ కార్డు ఉండాలి. ఈ మూడు డాక్యుమెంట్లు ఉంటే ఈజీగానే స్కీమ్‌లో చేరొచ్చు.
స్కీమ్‌లో చేరితే ఎంత డబ్బు ఇస్తారు?
మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందిస్తుంది. అయితే డబ్బుల ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేస్తుంది. అంటే రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వస్తాయి.
డబ్బులు రాకపోతే ఏం చేయాలి?
రైతులకు పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే దగ్గరిలోని అగ్రికల్చర్ ఆఫీసర్‌ను కలవండి. ఒకవేళ వీరు మీ సమస్యను పరిష్కరించలేకపోతే.. అప్పుడు హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయొచ్చు. లేదంటే pmkisan-ict@gov.inకు మెయిల్ కూడా పంపొచ్చు.
పీఎం కిసాాన్ హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే!
PM Kisan Toll Free Number: 18001155266PM Kisan Helpline Number: 155261PM Kisan Landline Numbers: 011-23381092, 23382401PM Kisan's new helpline: 011-24300606PM Kisan helpline: 0120-6025109
-----------------------------------------------------------------------------------------------------------------------------
tags
పీఎం కిసాన్ పథకం అంటే ఏంటి? ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ప్రధాని కిసాన్ సమ్మన్ నిధి (PM Kisan Samman Nidhi) పథకం కింద రైతుల ఖాతాలో ఆరవ విడత
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల అయ్యాయి. రూ.18 వేల .
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లోకి రూ.2000 జమ.. వివరాలు ఇలా చెక్ చేసుకోండి. PM Kisan .
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు మరో విడత నగదు బదిలీ ... telugu news. Zee NewsEnglish ... PM Kisan Samman Nidhi: రైతులకు తీపి కబురు
0 Comments
Thank you For Your Comment We Will Get In Touch You Soon