YSR చేయూత పధకం లబ్ధి దారుల ఎంపికకు వాలంటీర్ల ద్వారా ఇంటింటా సర్వే నిర్వహించాలని పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. 45 ఏళ్ళు నిండి 60 ఏళ్ల లోపు వయసు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీ మహిళలకు 75000 ఆర్ధిక సహాయం అందజేస్తారు. ఇప్పటికే పింఛను పొందుతున్న వారు ఈ పధకానికి అనర్హులుగా పేర్కొన్నారు.
గ్రామేన ప్రాంతాలలో నెలకు 10000 లోపు ఆదాయం పట్టణ ప్రాంతంలో 12 వెలలోపు ఆదాయం ఉండే కుటుంబాలు ఈ పధకానికి అర్హులు. వై ఎస్ ఆర్ చేయూత పథకం ద్వారా 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల SC, ST, BC, Minority మహిళలందరికీ ప్రభుత్వము 75 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ప్రతీ సంవత్సరం రూ.18,750 /- రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాలు అర్హులైన ప్రతి మహిళ కి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా సహాయము అందుతుంది.
లబ్ధి దారుల ఎంపిక కోసం వాలంటీర్లు న్తింట సర్వే లో 15 అంశాలపై మొబైల్ అప్ ద్వారా వివరాలు సేకరిస్తారు.
అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచి వాటిపై గ్రామ సభ నిర్వహించి సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు.
అభ్యంతరాలు, పిర్యాదులు స్వీకరించిన అనంతరం తుది లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తారు.వాలంటీర్స్ అందరూ మీ పరిధిలోని మీ కుటుంబాలలో వై యస్ ఆర్ చేయూత పధకానికి అర్హులైన మహిళల వివరాలను సర్వే చేసి జాగ్రత్తగా పరిశీలించి మీకు ఇవ్వబోయే APP నందు నమోదు చేయాలి. APP లో ఈ క్రింది వివరములను సేకరించి ఎంటర్ చేయవలెను.
1. లబ్దిదారుని పేరు
2. ఆధార్ నంబర్
3. మొబైల్ నంబర్
4. ఇన్కమ్ సర్టిఫికెట్
5. క్యాస్ట్ సర్టిఫికెట్
6. భూమి వివరాలు
7. వాహనము వివరాలు
8. మున్సిపాలిటీలో ఉన్న ఆస్తి వివరాలు
9. కుటుంబంలోని ఉద్యోగస్తుల వివరాలు
10. బ్యాంక్ అకౌంట్ నెంబర్
11. ఐ ఎఫ్ ఎస్ సి కోడ్
12. లబ్దిదారుని యొక్క ఫోటో
వైఎస్ఆర్ చేయూత పధకానికి కావాల్సిన అర్హతలు:
1. కుటుంబం యొక్క నెలసరి ఆదాయం మొత్తం గ్రామీణ ప్రాంతాలలో 10 వేల రూపాయలు మరియు పట్టణ ప్రాంతాలలో 12 వేల రూపాయలు మించకూడదు.
2. లబ్ధిదారుని వయసు ఆధార్ ప్రామాణికంగా తీసుకొనవలెను.
3. కుటుంబంలో మాగాణి భూమి 3 ఎకరాలు లేదా మెట్ట భూమి 10 ఎకరాలు లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 10 ఎకరాలు మించకూడదు.
4. కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు (టాక్సీ ట్రాక్టర్ ఆటో లకు మినహాయింపు)
5.కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి మరియు ప్రభుత్వ పెన్షనర్ ఉండకూడదు.
6.మున్సిపల్ ఏరియా లో కుటుంబానికి 1000 చదరపు అడుగులు మించి నివాస స్థలం ఉండకూడదు.
7. కుటుంబంలో ఎవరు ఆదాయపు పన్ను చెల్లించ కూడదు.
0 Comments
Thank you For Your Comment We Will Get In Touch You Soon