ఆరోగ్యశ్రీ కు సంబంధించిన సమాచారం :
1. కొత్త ఆరోగ్య శ్రీ కార్డు :
ఎవరికి అయితే కొత్త కార్డు కావాలో వారు అందరు హౌస్ హోల్డ్ మాపింగ్ చేసకొని కొన్ని రోజుల తరువాత డిజిటల్ అసిస్టెంట్/ANM గ్రామ వార్డ్ సచివాలయం లాగిన్ నందు కొత్త కార్డు దరఖాస్తు చేసుకోవచ్చు.
2. సభ్యుల చేర్పు :
a.కొత్తగ పెళ్లి అయ్యి కోడలు అత్తగారి కార్డు లో చేర్పు :
మొదటగా కొత్తగా పెళ్లి అయిన కోడళను అత్తగారి ఇంటిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయవలెను. అలా చేసిన తరువాత అమ్మాయి వల్ల కార్డు లో అమ్మాయి పెళ్ళికి ముందు ఉంటే అక్కడ Migration Due Marriage అని డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో సబ్మిట్ చెయ్యాలి. ముందు గ లేక పోతే చెయ్యనవసరం లేదు. అప్పుడు అత్తగారి పరిధిలో డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ నవశకం నందు అడిషన్ పెట్టుకోవాలి.
b. పుట్టిన పిల్లలను చేర్చుట :
డిజిటల్ అసిస్టెంట్ వారి నవశకం లాగిన్ లో డైరెక్ట్ గ 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారిని ఆడ్ చెయ్యవచు.
c. ఏ కార్డు లో లేకుండా 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారిని చేర్చుట కొరకు :
మొదటగా వారి కుటుంబంలో హౌస్ హోల్డ్ మాపింగ్ ద్వారా చేర్చి తర్వారా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో చేర్చు కోవచ్చు.
3. సభ్యుల తొలగింపు :
ఒక వ్యక్తిని తొలగించాలి అంటే మొదటగా అతనిని హౌస్ హోల్డ్ మాపింగ్ నందు "Permanent Migration / Death Declaration / Temporary Migration / Migration Due to Marriage " లో వారికి అనుగుణంగా ఒకటి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయవలెను. తరువాత వేరే చోట చేర్చిన తరువాత నవశకం లాగిన్ నందు అతనికి "Permanent Migration / Death Declaration / Temporary Migration / Migration Due to Marriage " అన్ని చూపిస్తాయి అప్పుడు ఎదో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే. కొన్ని రోజుల్లో అతను ఆ కార్డు నుంచి డిలీట్ అవుతాడు.
0 Comments
Thank you For Your Comment We Will Get In Touch You Soon